అమెజాన్ లక్కీ లాటరీ పేరుతో టీచర్ ను ట్రాప్ చేసి.. 

  • సైబర్ మోసాల్లో రూ.6 లక్షలకుపైగా కొట్టేసిన్రు

హైదరాబాద్‌‌,వెలుగు: అమెజాన్‌‌లో లక్కీ లాటరీ తగిలిందంటూ సైబర్ క్రిమినల్స్ ఓ టీచర్ ను ట్రాప్ చేసి డబ్బులు కొట్టేశారు. ముషీరాబాద్ కి చెందిన శ్రీనివాస్ గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. సమ్మర్ లో తన చెల్లెలు పెళ్లి ఉండటంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు.  ఈ నెల12న శ్రీనివాస్‌‌కి ఓ ఫోన్‌‌ కాల్‌‌ వచ్చింది. అమెజాన్‌‌ నుంచి లక్కీ లాటరీ తగిలిందని కాల్ చేసిన వ్యక్తి శ్రీనివాస్ ను నమ్మించాడు. లాటరీలో 43 ఇంచెస్ సోనీ ప్లాస్మా టీవీని గెలుచుకున్నారని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ తన పర్సనల్‌‌ డీటెయిల్స్‌‌ ను  కాల్ చేసిన వ్యక్తికి చెప్పాడు. రూ.5 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే టీవీని హైదరాబాద్‌‌ కు ట్రాన్స్‌‌పోర్ట్  చేస్తామని అవతలి వ్యక్తి తెలిపాడు. దీంతో పాటు రిజిస్ట్రేషన్, జీఎస్‌‌టీ, రోడ్ ట్యాక్స్‌‌, ముంబయి నుంచి డెలివరీ కోసం కస్టమ్స్ చార్జీలు ఇలా మొత్తం  శ్రీనివాస్ దగ్గరి నుంచి రూ.5లక్షల50 వేలను వసూలు చేశాడు. అదనంగా చెల్లించిన డబ్బును రీఫండ్ చేస్తామని శ్రీనివాస్ ను నమ్మించాడు. ఈ క్రమంలో రూ.60 వేలు విలువ చేసే టీవీ కోసం రూ.5 లక్షల54 వేలు కట్టినట్టు శ్రీనివాస్ గుర్తించాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుని సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. చెల్లెలు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మొత్తాన్ని సైబర్ క్రిమినల్ కొట్టేశాడని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.

సిమ్ అప్ డేట్ పేరుతో రూ.98 వేలు ట్రాన్స్ ఫర్

ఎయిర్‌‌‌‌టెల్‌‌ సిమ్‌‌ అప్‌‌డేట్‌‌ చేసుకోవాలంటూ సైబర్ క్రిమినల్ ఓ యువతి దగ్గరి నుంచి రూ.98 వేలు కొట్టేశాడు. ఎస్‌‌ఆర్‌‌‌‌ నగర్‌‌‌‌లోని రాజీవ్‌‌నగర్‌‌‌‌కి చెందిన వాణికి రెండ్రోజుల క్రితం ఎయిర్‌‌‌‌టెల్ కస్టమర్ కేర్‌‌‌‌ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. సిమ్ నంబర్ అప్‌‌డేట్‌‌ చేసుకోవాలని,  లేదంటే డీయాక్టివేట్‌‌ అవుతుందని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు.  అప్‌‌డేట్ కోసం ఎనీ డెస్క్ యాప్‌‌ డౌన్‌‌ లోడ్ చేసుకోవాలన్నాడు. తర్వాత నెట్‌‌బ్యాంకింగ్‌‌తో రూ.98 వేలు ట్రాన్స్‌‌ఫర్ చేసుకున్నాడు. బ్యాంక్‌‌ అకౌంట్‌‌ నుంచి మెసేజ్ రావడంతో వాణి అలర్ట్‌‌ అయ్యింది. బ్యాంక్‌‌కి వెళ్ళి చెక్‌‌ చేసుకుంది. సైబర్ ఫ్రాడ్‌‌ జరిగినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.

ఇవి కూడా చదవండి

బిజీ రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల యాక్షన్ ప్లాన్

టీఆర్ఎస్ పాలనలో దళితులకు ద్రోహం

పెద్దసార్లు దిగరు.. కొలువులు రావు

అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్