కరీంనగర్ టౌన్, వెలుగు: ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ శ్రేణులు దావత్‌లు చేసుకుంటూ పాలనను గాలికొదిలేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మంగళవారం కరీంనగర్ సిటీలోని ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ అనాథలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.
Also Read:స్మార్ట్ కంపోజ్ ఫీచర్ ప్రవేశపెట్టిన గూగుల్
రైతుబంధు ద్వారా ఉన్నత వర్గాలకు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు పథకాన్ని పేదరైతులకు ఇచ్చి మిగతా డబ్బులను అనాథల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లీడర్లు బెజ్జంకి అనిల్, వెంకటస్వామి, సాగర్, అంజయ్య, నర్సన్న పాల్గొన్నారు.