గోల్డ్ ధరలతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటే అవకాశం ఉంది. ఇప్పటికే ధరలు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి తగ్గుతున్నాయి.. మరోసారి పెరుగుతున్నాయి. అయితే.. వచ్చే 12 నెలల్లో అంటే రాబోయే ఏడాది సమయంలో వెండి ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు బిజినెస్ నిపుణులు. అంటే కిలో వెండి ధర రూ. 85వేలకు చేరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
వెండి ధరల జోరు కొనసాగే అవకాశం ఉందని, రానున్న కొద్ది నెలల్లోనే మరో 15 శాతం ధరలు పెరగవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక పేర్కొంది.
ALSO READ : సూరారంలో విషాదం..మూడో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడు మృతి
2023 ఏడాదిలో మొదటి నాలుగు నెలలు వెండి ధరలు భారీగా పెరగడంతో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత నెల నుంచి వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం స్థిరంగా ఉన్నా.. రాబోయే ఏడాదిలో మాత్రం ధరలు పెరుగుతాయంటున్నారు.