అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి కొండ‌చిలువ‌.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

హైదరాబాద్​ : బాచుప‌ల్లి పోలీస్​స్టేష‌న్ ప‌రిధిలోని ఎన్ఆర్ఐ కాల‌నీలో ఓ కొండ చిలువ క‌ల‌క‌లం సృష్టించింది. ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కొండ‌చిలువ‌ను గుర్తించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అపార్ట్‌మెంట్‌వాసులు వెంటనే అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. వారు ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సిబ్బందికి స‌మాచారం అందించారు. వెంటనే వారు ఆ అపార్ట్‌మెంట్ వ‌ద్దకు చేరుకున్నారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ వాలంట‌రీ.. చాక‌చ‌క్యంగా కొండ‌చిలువ‌ను ప‌ట్టేశారు. ఆ తర్వాత కొండచిలువను అడవిలో వదిలేశారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు.

ఎన్ఆర్ఐ కాల‌నీలోకి స‌మీపంలో ఉన్న చెరువులో నుంచి కొండ‌చిలువ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వ‌చ్చి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే.