
పుణె: ఫిడే విమెన్స్ గ్రాండ్ ప్రి పుణె ఎడిషన్ ఐదో రౌండ్‌లో తలపడ్డ ఇండియా గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌ను డ్రా చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ గేమ్‌లో 19 ఎత్తుల తర్వాత ఇద్దరు ప్లేయర్లు డ్రాకు అంగీకరించి పాయింట్ పంచుకున్నారు.
ఈ రౌండ్‌లో ఆర్. వైశాలి మాత్రమే విజయం సాధించింది. తను 52 ఎత్తుల్లో మంగోలియాకు చెందిన బాత్కుయాగ్‌ను ఓడించింది. దివ్య దేశ్ ముఖ్ రష్యాకు చెందిన పోలినా షువాలోవాతో గేమ్‌ను 72 ఎత్తుల తర్వాత డ్రా చేసుకుంది.