- కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు
- బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
నాగర్ కర్నూల్: ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులకు తొమ్మిదో తారీఖైనా జీతాలు రావడం లేదని విమర్శించారు బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదన్నారు. వాస్తవాలు రాస్తున్న విలేఖర్లపై ప్రభుత్వం కేసులు పెడ్తోందని, యూ ట్యూబ్ ఛానళ్లను బెదిరిస్తోందని చెప్పారు. నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడలో బీఎస్పీ జెండా ను ఆవిష్కరించారు ప్రవీణ్ కుమార్. కొన్నిప్రతిపక్ష పార్టీలు బీఎస్పీని అణచివేయాలని చూస్తున్నాయని, అది సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూస్తుంటే కంట్లో నీళ్లొస్తున్నాయి
ల్యాప్‌టాప్ వాడుతున్నారా? ఈ గాడ్జెట్స్ మీ కోసమే