ఆ ఆశ ఎప్పుడూ ఉంటుంది

ఆ ఆశ ఎప్పుడూ ఉంటుంది

శుభలగ్నం, మావిచిగురు లాంటి చిత్రాలతో ఒకప్పుడు హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకున్న ఆమని, సెకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ మెప్పిస్తున్నారు. ఆమని నట వారసురాలిగా తన మేనకోడలు హ్రితికా శ్రీనివాస్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. విశ్వ కార్తికేయతో కలిసి హ్రితిక నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. చలపతి పువ్వుల దర్శకుడు. ఎన్.చంద్రమోహనరెడ్డి నిర్మించారు. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేనకోడలుతో కలిసి ఆమని ఇలా ముచ్చటించారు. ‘పదేళ్ల వయసులో ‘చాప్లిన్ సామంతి’ అనే తమిళ చిత్రంలో లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించింది హ్రితిక. ఆమె యాక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాలెంట్ చూసి ఎంకరేజ్ చేశాను. క్లాసికల్, వెస్ట్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యాన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేర్చుకుంది. రీసెంట్‌గా ఓ తమిళ సినిమాతో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిచయమైంది. కన్నడలోనూ మరో సినిమా చేస్తోంది. ‘అల్లంత దూరాన’ చిత్రంతో తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతోంది. నేను కూడా ఓ గెస్ట్ రోల్ చేశాను. ఫ్యామిలీ, పిల్లల వల్ల సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాను.  ఇప్పుడిక మళ్లీ వరుసగా నటిస్తున్నాను. ఆర్టిస్ట్ అనే వాళ్లకు ఎన్ని మంచి పాత్రలు వచ్చినా ఇంకా మంచి పాత్రలు పోషించాలనే ఆశ ఎప్పుడూ ఉంటుంది. పోలీస్, దేవత లాంటి పాత్రలు చేయాలనే కోరిక ఉంది’ అని చెప్పారు. హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బోల్డ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించానని, మేనత్త బాటలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మెప్పించాలని ఆశిస్తున్నట్టు చెప్పింది హ్రితిక.