ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో.. ఓటమి ముంగిట లంక

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో.. ఓటమి ముంగిట లంక

గాలె: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో శ్రీలంక ఓటమి ముంగిట నిలిచింది. ఏంజెలో మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ (76), కుశాల్‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌ (48 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) మినహా మిగతా వారు ఫెయిల్‌‌‌‌‌‌‌‌ కావడంతో.. శనివారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు లంక రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 62.1 ఓవర్లలో 211/8 స్కోరు చేసింది. 

ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు కునెమన్‌‌‌‌‌‌‌‌ (4/52), లైయన్‌‌‌‌‌‌‌‌ (3/80) దెబ్బకు హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌ కుప్పకూలింది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం శ్రీలంక 54 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. అంతకుముందు 330/3 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 106.4 ఓవర్లలో 414 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

దీంతో కంగారూలకు 157 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ లభించింది.  స్మిత్‌‌‌‌‌‌‌‌ (131), అలెక్స్‌‌‌‌‌‌‌‌ క్యారీ (156) భారీ సెంచరీలతో చెలరేగారు. ప్రభాత్‌‌‌‌‌‌‌‌ జయసూరియా 5, నిశాన్‌‌‌‌‌‌‌‌ పీరిన్‌‌‌‌‌‌‌‌ 3, రమేశ్‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు పడగొట్టారు.