దుబాయ్ : ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్టీ20) మూడో ఎడిషన్‌లో ఇండియా మాజీ క్రికెటర్, హైదరాబాదీ అంబటి రాయుడు బరిలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్, వెస్టిండీస్ హిట్టర్లు నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్ వంటి గ్లోబల్ క్రికెటర్లు కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు ఈ టోర్నీ ఆడేందుకు బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చింది.
యూఏఈ లో మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతుందని ఆర్గనైజర్లు ప్రకటించారు. అబుదాబి, దుబాయ్, షార్జా వేదికలుగా 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరు జట్లు బరిలో ఉన్న లీగ్‌లో మతీష పతిరణ, డేవిడ్ విల్లీ, సునీల్ నరైన్, టిమ్ డేవిడ్, రోవ్‌మన్ పావెల్, హెట్మయర్, ట్రెంట్ బౌల్ట్, క్రిస్ వోక్స్ వంటి ఇంటర్నేషనల్ క్రికెటర్లు ఆడనున్నారు.