అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీసిన పరిటాల గ్రామస్తులు

అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీసిన పరిటాల గ్రామస్తులు

ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నందిగామ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావును గ్రామస్తులు నిలదీశారు. ‘మాకు ఇండ్లు లేవు.. కరెంట్ స్తంభాలు లేవు’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఓట్లు అడగడానికి మళ్లీ వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామంటూ ఎమ్మెల్యేను గ్రామస్తులు హెచ్చరించారు. మరోవైపు.. పరిటాల గ్రామ ప్రజలు తమ ఇండ్లళ్లకు రావొద్దని బహిరంగంగానే చెబుతున్నారు. 

ఈ ప్రాంతంలో లబ్ధిదారులైన తమకు ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటరీలు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని  పరిటాల గ్రామస్తులు ఆరోపించారు. పార్టీల ప్రతిపాదన బట్టే వాలంటరీలు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీసి.. అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ నెలకొంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.