హైదరాబాద్, వెలుగు: బిగ్ బిలియన్ డేస్ నేపథ్యంలో ఈ–-కామర్స్ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ తొమ్మిది ప్రధాన నగరాల్లో సెల్లర్ల సదస్సులను నిర్వహించింది. దాదాపు 1.4 మిలియన్లకు పైగా ఎంటర్‌ప్రెనూర్లు, సెల్లర్లు వ్యాపార అవకాశాలను పెంచునేందుకు శిక్షణ ఇచ్చింది.
పండుగ సీజన్‌లో అమ్మకందారులకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి అవగాహన కల్పించింది. ఆన్-గ్రౌండ్ సెల్లర్ కాన్క్లేవ్లలో హైదరాబాద్, జైపూర్, సూరత్, ఢిల్లీ, ఆగ్రా, ముంబై, బెంగుళూరు, లూథియానా, తిరుపూర్ నుంచి 4,500 మంది సెల్లర్లు పాల్గొన్నారు.
కస్టమర్ డిమాండ్, కొనుగోలు విధానాలు, వృద్ధి- ఆధారిత ప్రణాళికలపై లోతైన పరిజ్ఙానం అందించడానికి ఈ సెషన్లను నిర్వహించామని ఫ్లిప్కార్ట్తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ 11వ ఎడిషన్‌కు ముందు పండుగ డిమాండ్‌ను తీర్చడానికి సెల్లర్లను సమాయత్తం చేశామని పేర్కొంది.