శిథిలావస్థకు చేరిన భవనాలపై జీహెచ్ఎంసీ ఫోకస్

 శిథిలావస్థకు చేరిన భవనాలపై జీహెచ్ఎంసీ ఫోకస్

గత ఆరురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరవాసులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది 584 భవనాలను గుర్తించింది. ఇప్పటివరకు 168 శిథిలావస్థకు చేరుకున్న భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు డేమాలిష్ చేశారు. గడిచిన రెండు రోజుల్లో 45 భవనాలను అధికారులు కూల్చివేశారు. 199 భవనాలను రిపేర్ చేసినట్టు తెలిపారు. మరో 257 బిల్డింగ్స్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు.