
సంగారెడ్డి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు మేలుకో అంటూ సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఎడ్లబండి ఎక్కి ప్రచారం చేశారు. జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ క్రాంతి.. శుక్రవారం సంగారెడ్డిలో రైతులతో కలిసి ఓటరు అవగాహన చైతన్య ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎడ్ల బండిపై నిల్చొని ప్లకార్డులు ప్రదర్శించి ఓటర్లను చైతన్యపరిచారు. అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.