పంట దిగుబడి తగ్గింది..మార్కెట్ల ఆదాయం తగ్గింది

మార్కె ట్ల ఆదాయంపై పంటల దిగుబడి తీవ్ర ప్రభావం చూపింది. దిగుబడి రాకపోవడంతో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు తగ్గి వ్యవసాయ మార్కె ట్లకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ ​పరిధిలో ఉమ్మడి వరంగల్,ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం , నల్గొండ జిల్లాలున్నాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో 19 జిల్లాలుగామారాయి. ఉమ్మడి ఈ ఐదు జిల్లాల పరిధిలో 104మార్కెట్​లున్నాయి. ఈ మార్కె ట్లకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.251.7 కోట్ల ఆదాయాన్ని టార్గెట్​గా నిర్ణయించారు. మార్చి నెలాఖరు వరకు లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలోమార్చి చివరి వరకు రూ. 183.83 కోట్ల ఆదాయంమాత్రమే వచ్చింది. టార్గెట్​లో 73.60 శాతంమాత్రమే సాధించగలిగారు. ఇందులో సూర్యాపేట,ములుగు మార్కెట్​కమిటీలు మినహా ఏవీ వందశాతం టార్గెట్​ను సాధిం చలేకపోయింది. మార్కె ట్ల ఆదాయం తగ్గడానికి దిగుబడులు తగ్గడం ప్రధానకారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలో 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి, 36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న పంటలు సాగు చేశారు. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షా భావానికి గురై దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ప్రభుత్వ సంస్థలకు కమీషన్​ మినహాయింపు, ఆయా సంస్థల నుంచి మార్కె ట్లకురావాల్సిన కమీషన్లు రాకపోవడం మరో కారణంగాచెబుతున్నారు. దీంతో మార్కె ట్ల ఆదాయం పడిపోతోంది. కొన్నిచోట్ల ఉద్యోగులు, వ్యాపారులు కుమ్మక్కై జీరో బిజినెస్ చేయడం వల్ల కూడా మార్కెట్​ఆదాయానికి గండిపడుతోం ది.

గత ఏడాది కంటే తక్కువ

అంతకు ముందు ఏడాది ఈ రీజియన్​ పరిధిలో రూ.226.9 కోట్ల ఆదాయం వచ్చిం ది. అప్పటితో పోల్చిచూసినా రూ.43.07 కోట్ల ఆదాయం తగ్గిం ది. దీనికిపంట దిగుబడులు తగ్గడమే కారణంగా చెబుతున్నా-రు. గత ఏడాది పత్తి దిగుబడులు తగ్గడం మార్కె ట్లఆదాయంపై ప్రభావం చూపింది. సీజన్​ ప్రారంభంలో పత్తి సాగు బాగానే చేపట్టారు. సకాలంలో వానలు లేకపోవడంతో పత్తి ఎక్కువగా పండించే వరంగల్,ఆదిలాబాద్, ఖమ్మం , కరీం నగర్​ జిల్లాల్లో దిగుబడు-లు పడిపోయాయి.టార్గెట్ చేరిన ములుగు, సూర్యాపేటఉమ్మడి ఐదు జిల్లాల పరిధిలో 104 మార్కెట్​ కమిటీలుం డగా ఇందులో ములుగు, సూర్యాపే ట మార్కెట్​ కమిటీలు మాత్రమే టార్గెట్​పూర్తిచేయడం గమనా-ర్హం. ములుగు మార్కెట్​కమిటీ 112. 88 శాతంతోతొలి స్థానంలో ఉంది. ఇక్కడ టార్గెట్​ రూ. 3.7 కోట్లుఉండగా రూ.4.17 కోట్ల ఆదాయం వచ్చింది. సూర్యాపే ట మార్కెట్​కమిటీ 102 శాతం ఆదాయాన్నిసాధించింది. ఈ మార్కెట్​ ఇన్ కం టార్గెట్​ రూ. 15కోట్లు ఉండగా రూ.15.43 కోట్లు సాధించింది.