- ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో గరిష్ట ధర నమోదు
వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో పత్తి ధర రికార్డు స్థాయిలో నమోదయింది. ఈ సీజన్ లో నే అత్యధికంగా ఇవాళ క్వింటాలుకు 8 వేల 515 రేటు పలికింది.ఈ ఏడాది కాటన్ దిగుబడి తగ్గిపోగా.. చివరి దశలో రేటు పెరుగుతోంది. ఇవాళ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు 10 వేల బస్తాల అమ్మకానికి తీసుకొచ్చారు రైతులు.రేటు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆదిలాబాద్ లోనూ ఇవాళ పత్తి క్వింటాలుకు 8 వేల 500 రేటు పలికింది. మార్కెట్ కి పెద్ద ఎత్తన పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు రైతులు.
ఇవి కూడా చదవండి:
కరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ శాఖ కసరత్తు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో.. 2 రోజుల జైలు శిక్ష