ప్రారంభంలోనే పగలే చుక్కలు చూపిస్తున్న సమ్మర్

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభమైందో లేదో అప్పుడే రాష్ట్రంలో పలు జిల్లాల్లో 4,5  డిగ్రీల టెంపరేచర్ ఒక్కసారిగి పెరిగింది.  ఇప్పటికే అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాళ్లు ప్రారంభమైయ్యాయి.  సాధారణంగా ఏప్రిల్ రెండవ వారం, మే నెలలోనే ఇంతలా ఎండ తీవ్రతలను చూస్తుంటాం.. కానీ  ఈ ఏడాది కాస్త ముందే ఎండలు పండిపడుతున్నాయి. 

ఇండస్టీయల్ ఎరియాలో మరీ ఎక్కువగా ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. వేసవి ఎండ తీవ్రతతో ప్రజలు మార్చి నెలలోనే  ఇళ్లకే పరిమితమైయ్యారు.  రోడ్లు అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉపాధి పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారికి ఈ ఎండలు పగలే చుక్కలు చూపిస్తున్నాయి.