- వేములవాడలో మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా: మన హెల్త్ కార్డు ఉండడం వలన ఆరోగ్య డేటాతో అత్యవసర సమయాల్లో కాపాడడాం చాల సులభం అవుతుంది.. ఎన్నో రకాలుగా ఉపయోగాలుంటాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా.. ఎప్పుడైనా.. ఏ దవాఖానకుకి వెళ్లినా డేటా క్లియర్ ఉంటుందని.. వైద్యులు కచ్చితమైన చికిత్స చేయడం ద్వారా తొందరగా జబ్బులు, రోగాల నుండి బయటపడే అవకాశం ఉంటుదని ఆయన తెలిపారు. శనివారం మంత్రి కేటీఆర్ వేములవాడలో పర్యటించారు. కరోనా కాలంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆశా వర్కర్ నుండి డాక్టర్ల వరకు కరోనా కాలంలో వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీస్ లు నిరంతరం కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
తీవ్రమైన సంక్షోభం వచ్చినప్పుడే కాపాడిన వారు గుర్తుంటారు
ఎవరికైనా సరే తీవ్రమైన సంక్షోభం వచ్చినప్పుడే కాపాడిన వారు గుర్తుంటారని, అందరికీ ఆరోగ్య భద్రత కోసం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ తయారు చేయాలని అనుకున్నామని వివరించారు. సిరిసిల్ల జిల్లాలో 4 లక్షల 22 వేళా మంది 18 ఏళ్లు నిండిన వారు ఉన్నారని, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంలో భాగంగా 220 బృందాలు ఇంటింటికీ వచ్చి పరీక్షలు చేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు, రక్తపోటు (బీపీ), మధుమేహం(షుగరు), గుండె, కిడ్నీ పనితీరు ఇతరత్రా డేటా ను ట్యాబ్ లో అప్లోడ్ చేస్తారని, అలాగే ఇంటి వద్దనే కంటి పరీక్ష, రక్త పరీక్షలు చేస్తారని వివరించారు. రాబోయే 60 రోజుల్లో పరీక్షలు పూర్తి అవుతాయని తెలిపారు.
ఊరిని బట్టి, ఏరియా ను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి రోగాలు వస్తాయని, సిరిసిల్ల జిల్లాలో ఉదాహరణకు క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నట్లు బేసిక్ గా గుర్తించామన్నారు. అందుకే డేటా ఆధారంగా భవిష్యత్ లో ఆరోగ్య తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడని వివరించారు. తెలంగాణ రాక ముందు ఏ ప్రభుత్వ దవాఖానలో కూడా ఐసీయూ కేర్ లేదు, కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాలలో ఐసియు కేర్ లు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యం ఎంతో ముఖ్యమైనది, వైద్యం విషయంలో ఎన్నో సాదించుకున్నామన్నారు. వేములవాడ ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ట్యాంక్, సిరిసిల్ల జిల్లాలో మూడు సిటీ స్కాన్ లు ఏర్పాటు చేశామన్నారు. వేములవాడ ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ ను కూడ ప్రారంభం చేశామని వివరించారు.
పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు
పొలిటికల్ టూరిస్టులు వేములవాడకి వస్తున్నారు, నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..రాసేటోళ్లు కూడా రాస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత 65, 70 ఏళ్లలో కానీ పనులు, మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా సాధ్యం అవుతున్నాయన్నారు. నాకు షుగర్ ఉందని పరీక్షలు చేసుకోవడం వలన 16 ఏళ్ల క్రితమే నాకు తెలిసింది, అప్పటి నుండి జాగ్రత్తగా ఉంటున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
సమగ్ర ఆరోగ్య సమాచారంతో హెల్త్ ప్రొఫైల్
సీఎం జగన్‌పై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు