- మున్సిపాలిటీల్లో ఆధిపత్య పోరు!
- రెండు మున్సిపాలిటీల్లో జోరుగా గ్రూప్ రాజకీయాలు
- అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య పెరుగుతున్న విభేదాలు
- కౌన్సిల్ మీటింగ్స్‌కు డుమ్మా కొడుతున్న అసమ్మతి కౌన్సిలర్లు
- ఫండ్స్ కేటాయింపులో కొందరికే ప్రియారిటీ ఇస్తున్నారని విమర్శలు
కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని మూడింటిలో రెండు మున్సిపాలిటీల్లో అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు పెరుగుతోంది. కౌన్సిలర్లు గ్రూపులుగా వీడిపోయారు. స్వపక్షంలోని వారే విపక్ష సభ్యులుగా వ్యవహరిస్తుండడంతో ఆ పార్టీ పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. చైర్మన్లు, వైస్చైర్మన్లు కొంత మందికే ప్రియారిటీ ఇస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి. మూడింటిలోనూ అధికార పార్టీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మెజారిటీ కౌన్సిలర్లు ఉన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య కొంత కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. కౌన్సిలర్లు మూడు గ్రూపులుగా విడిపోయారు. చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాలతో పాటు, మరి కొందరు కౌన్సిలర్లు కలిసి ఓ వర్గంగా ఏర్పడ్డారు. కౌన్సిల్ మీటింగ్స్‌లో ప్రతి పక్ష కౌన్సిలర్లకు దీటుగా అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. సమస్యలపై గళమెత్తుతున్నారు. మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ మిగతా వార్డులకు పండ్స్ కేటాయింపులో వివక్ష చూపుతున్నారని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. గతంలో కొన్ని సార్లు మీటింగ్స్‌లో ఎజెండా అంశాలను కూడా అధికార పార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య కూడా అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. చైర్మన్ సత్యనారాయణపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పలువురు కౌన్సిలర్లు కొద్ది రోజుల కింద ప్రయత్నించారు. ఇందుకోసం టూర్‌కు వెళ్లి క్యాంపు రాజకీయాలు కూడా చేశారు. చివరకు ఎమ్మెల్యే జాజాల సురేందర్ జోక్యం చేసుకుని అసమ్మతి కౌన్సిలర్లను బుజ్జగించి అవిశ్వాస నోటీసులు ఇవ్వకుండా కట్టడి చేశారు. ఎమ్మెల్సీ కవితతో మాట్లాడించారు. అవిశ్వాస అంశం ఆగిపోయినప్పటికీ అంతర్గత పోరు పెరుగుతూనే ఉంది.
మీటింగ్‌కు హాజరు కాలే..
కామారెడ్డి కౌన్సిల్ మీటింగ్ మంగళవారం చైర్పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మీటింగ్‌కు 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. తమ వార్డుల్లో డెవలప్మెంట్వర్క్స్కు ఫండ్స్ ఇవ్వాలని కౌన్సిల్ ముఖ్యుల దృష్టికి తీసుకెళ్లినా ఎజెండాలో చేర్చలేదనే కారణంతో వీరు గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆఫీసర్లు తమను ఖాతరు చేయడం లేదని కొందరు కౌన్సిలర్లు భావిస్తున్నారు..పార్టీలోని కొందరు లీడర్లు గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
మీటింగ్‌కు హాజరు కాలే..
కామారెడ్డి కౌన్సిల్ మీటింగ్ మంగళవారం చైర్పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మీటింగ్‌కు 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. తమ వార్డుల్లో డెవలప్మెంట్వర్క్స్కు ఫండ్స్ ఇవ్వాలని కౌన్సిల్ ముఖ్యుల దృష్టికి తీసుకెళ్లినా ఎజెండాలో చేర్చలేదనే కారణంతో వీరు గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆఫీసర్లు తమను ఖాతరు చేయడం లేదని కొందరు కౌన్సిలర్లు భావిస్తున్నారు.. పార్టీలోని కొందరు లీడర్లు గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.