ఉదయ్ పూర్ సెంట్రల్ జైల్ కూలర్లు.. ఎంత డిమాండ్ ఉందో తెలుసా?

ఉదయ్ పూర్ సెంట్రల్ జైల్ కూలర్లు.. ఎంత డిమాండ్ ఉందో తెలుసా?

 మీరు నమ్ముతారో లేదో.. ఉదయ్ పూర్ జైల్లోని ఖైదీలు రాజస్థాన్ ప్రజలకోసం తయారు చేస్తున్నారు. జైల్లో తయారు చేసిన కూలర్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. మంచి పనితనం చూపిస్తున్నాయి ఈ కూలర్లు. అందుకే రాజస్థాన్ ప్రజలు ఎగబడి కొంటున్నారు. రాజస్థాన్ లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో అల్లాడిపోతున్న ప్రజలకు ఓ మంచి కూలర్లను అందించాలని రాజస్థాన్ పోలీస్ డిపార్టుమెంట్ ఉదయ్ పూర్ ఖైదీలకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి మరీ ఈ కూలర్లను తయారు చేయించారు. 

మే నుంచి ఇప్పటివరకు ఖైదీలు దాదాపు 500 కూలర్లను తయారు చేశారు. అయితే అది అంతం కాదు. ఈ సంవత్సరం నుంచి ప్రతియేటా కూలర్లను తయారు చేయిస్తామంటున్నారు జైలు అధికారులు. ఇది  జైలు నుంచి ఖైదీలు విడుదలై బయటికి పోయిన తర్వాత వారికి జీవనోపాధికి ఉపయోగపడేందన్నారు. పునరావాస పథకం కింద కూలర్ల తయారీ ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు జైలు అధికారులు. 

ఉదయ్ పూర్ జైల్లో ఖైదీలు తయారు చేసిన కూలర్లకు మంచి డిమాండ్ ఉందట.. ఈ ఎయిర్ కూలర్లు చాలా ధృడంగా ఉన్నాయి. మండుతున్న ఎండా వేడిమిను అధిగమించడానికి చల్లని గాలిని ఇస్తున్నాయట. ఈ కూలర్లను 22 గేజ్ షీట్లను ఉపయోగించి  తయీరు చేస్తున్నారట ఖైదీలు.. వీటి నీటి సామర్థ్యం 90 లీటర్ల వరకు ఉంటుందట. సాధారణ కూలర్లలో ఇలాంటివి దొరకవు. ఈ కారణంగా తక్కువ సమయంలో ఎక్కువ చల్లని గాలిని పొంది వేడిమి నుంచి ఉపశమనం పొందొచ్చంటున్నారు. దీంతో ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఎక్కువగా అమ్ముడు పోవడమే కాకుండా... మంచి డిమాండ్ ను కలిగి ఉన్నాయని జైలు అధికారులు చెబుతున్నారు.