యూపీలో ఓబీసీలు, దళితులు బీజేపీ వైపే

ఢిల్లీ అధికార పీఠానికి వెళ్లాలంటే వయా లక్నో  అన్నది నానుడిగా మారిపోయింది. ఇప్పటి వరకు పార్టీలన్నీ యూపీని వాడుకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వచ్చిన రెండు కుటుంబ ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రాన్ని మరో జంగల్ రాజ్​గా మార్చాయి. ముఖ్యంగా జనాభాలో అగ్రస్థానంలో ఉన్న ఓబీసీలను కులాలుగా విభజించి..వాడుకుని గద్దెనెక్కాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మత వివక్ష, గుండాటాక్స్ .. సిద్ధాంతాలతో యూపీ ప్రజలను సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ వాద్ పార్టీ, కాంగ్రెస్ మోసం చేస్తూ కాలం వెళ్లదీశాయి.

ముఖ్యంగా సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ కులం, మతం పేరుమీద ప్రభుత్వాలను ఏర్పరుస్తూ ఓబీసీలను ఘోరంగా వంచించాయి. గతంలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు యాదవేతర, జాతవేతర ప్రజలు 221 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచారు. సుమారు ఇరవై ఏండ్ల తర్వాత నేటి కేంద్ర హోం మినిస్టర్‌‌‌‌‌‌‌‌ అమిత్ షా చాణక్యంతో మళ్లీ సోషల్ ఇంజనీరింగ్ జరిగి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు కీలకంగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీలో అక్కడి ఓబీసీలు తమ స్వంత వ్యక్తిని చూసుకున్నారు.

ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ పేదవాడు ప్రధాని అయ్యాడు..

మొదటిసారి ఓ పేదవాడు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ఈ దేశ ప్రధాని పదవికి పోటీ పడడం అక్కడి ప్రజలకు ముచ్చట గొలిపింది. 2014లో బీజేపీ పొందిన ఓట్లలో ఓబీసీ, దళిత ఓట్లు కీలకం అయ్యాయి. 42.63 శాతం ఓట్లతో 78 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించడంలో ఓబీసీలు కీలకం అయ్యారు. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి 52.80 శాతం ఓట్లు బీజేపీకు వచ్చాయి. బీజేపీ గెలిపించుకున్న శాసన సభ్యుల్లో 31.50 శాతం ఓబీసీలు, 20.80 శాతం ఎస్సీలు, 0.49 శాతం ఎస్టీలు ఉండటం చెప్పుకోదగ్గ అంశాలు. 2014 పార్లమెంట్ అభ్యర్థులు 80 మంది ఉండగా, 27 టిక్కెట్లు ఓబీసీలకు ఇవ్వడం ఓ చారిత్రక ఘట్టం. 2017లో ఏర్పడిన యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో 31.50 ఓబీసీలు, 12.90 ఎస్సీలు ఉండటం గమనార్హం. ఆఖరుకు రాష్ట్ర బీజేపీ పదాధికారుల్లో ఓబీసీ, దళిత, ఎస్టీలు కలిపి 53 శాతం ఉండటం మరే పార్టీ చేయలేని చారిత్రాత్మక నిర్ణయాలు. 2019 బీజేపీ నుండి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులలో 68.90 శాతం అగ్రవర్ణేతరులు ఉండటం యూపీలో బీజేపీ సాధించిన సోషల్ ఈక్వాలిటీని ప్రతిబింబిస్తుంది. కేంద్రంలోని ప్రభుత్వంలో 61 శాతం ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు మంత్రి పదవులు పొందారు. 

బీజేపీనే నిజమైన బహుజన పార్టీ

బీజేపీ అనేక రాష్ట్రాలలో బీసీలకు కీలకమైన స్థానాలు ఇచ్చింది. 303 మంది ఎంపీల్లో 118 మంది ఓబీసీలు, 58 ఎస్సీ, 43 ఎస్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు బీజేపీనే నిజమైన బహుజనుల పార్టీగా ప్రజలు భావిస్తున్నారు. అక్కడి ప్రజలు బహుజనులకు అధికారం పేరుతో వంచన చేసిన పార్టీలను 2017లో మట్టికరిపించారు. ఇప్పుడు బీజేపీను ఓబీసీ, దళిత వర్గాలు తమ పార్టీగా భావిస్తున్నారు. కుటుంబ పార్టీలు అనేక కుయుక్తులు పన్నినా, యోగి ఆదిత్యనాధ్ ధైర్యంగా వాళ్లను ఎదుర్కొంటూ వచ్చాడు. ముఖ్యంగా గుండారాజ్ నుండి విముక్తి కల్పించేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడు. తీవ్రమైన నేరారోపణలు ఉన్న వాళ్లను నిర్దాక్షిణ్యంగా అణిచివేశాడు. ప్రజలను పీడించే శక్తులకు వెన్నులో వణుకు పుట్టించాడు. అలాగే అసాంఘిక శక్తులకు యూపీలో నిలువనీడ లేకుండా చేశాడు. అక్కడ సోషల్ ఇంజనీరింగ్​తోపాటు నేషన్ ఇంజనీరింగ్ మొదలుపెట్టాడు. కులాల కుంపట్లపై చలికాచుకునే పార్టీలకు బుద్ధి చెప్పి ప్రజలు మరోసారి అవినీతి మరకలేని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీకు పట్టం కట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. అందుకు కారణం- యోగి ధైర్యంతో అభివృద్ధి పట్ల నిబద్ధతో ఉండటమే. ముఖ్యంగా యోగి బీజేపీ ప్రభుత్వం వల్ల అక్కడి బహుజనులను లెక్కలేనంత మేలు జరిగింది. గుండాలు, మాఫియా ముఠాలకు చెందిన 2 వేల కోట్ల ఆస్తి జప్తు చేయడం ప్రజలకు వాళ్ల నుండి రక్షణ కల్పించేందుకు ఆస్కారం ఏర్పడింది. వివిధ వ్యాపారాలు చేసుకుని బతికే ఓబీసీలకు వాళ్ల నుండి రక్షణ, గుండాటాక్స్ నుండి విముక్తి, స్వేచ్ఛగా బతికే అవకాశం కలగడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కోటి మంది విద్యార్థులకు ట్యాబ్స్, మొబైల్స్ అందించడం వల్ల పేద విద్యార్థులు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు వినే అవకాశం కలిగిస్తున్నాయి.

రైతు రుణ మాఫీలు..ఉజ్వల గ్యాస్‌‌‌‌ పథకం

పేదింటి ఆడపిల్లలకు డిగ్రీవరకు ఉచిత విద్యకు అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే 4. 5 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం వల్ల అందులో భాగా లాభపడింది బహుజన వర్గాలే. ఏళ్ల నుండి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు నింపడం వల్ల బహుజన వర్గాలకు ఉద్యోగాలు,  సమాజానికి విద్య 
అందుబాటులోకి వచ్చింది. 86 లక్షల మంది రైతులకు 36 వేల కోట్లు రుణమాఫీ చేయడంతో పేద వర్గాలకు రైతుల వ్యవసాయం గాడిలో పడింది. అంత పెద్ద యుపిలో జిల్లాకో మెడికల్ కాలేజి నిర్మాణం, 1.67 కోట్ల మంది పేద మహిళలకు ఉజ్వల గ్యాస్ పథకం కింద గ్యాస్ అందించడం జరిగింది. 2.61 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణంతో పేద మహిళల ఆత్మగౌరవం నిలబెట్టింది. అలాగే ఉచిత రేషన్ రెండింతలు ఈ కష్టకాలంలో అందించడం వల్ల పేదవారు స్వాంతన పొందారు. యోగీ, మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ వేగవంతంగా ప్రజలకు మేలు చేకూర్చింది. దాంతో ఉత్తరప్రదేశ్ ప్రజలు మరోసారి ఈ డబుల్ ఇంజన్ డెవలప్​మెంట్ జరగాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. ప్రచారం వర్చువల్ గా జరుగుతున్నా ప్రజల స్పందన గొప్పగా ఉంది. ముఖ్యంగా అక్కడి ఓబీసీ, దళిత వర్గాలకు జరిగిన మేళ్లను గత ప్రభుత్వాలతో పోల్చి చూసుకుంటున్నారు.

బీసీ కమిషన్‌‌‌‌కు రాజ్యాంగ హోదా కల్పించడం..

ఎన్నోసార్లు కేంద్రంలో అనేక ప్రభుత్వాలు సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాద్ పార్టీల మద్దతుతో ఏర్పడ్డవే. యూపీలో కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయాధికారం పొందిన ఈ పార్టీలు ఓబీసీలకు చేసింది మాత్రం శూన్యం. మోడీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్‌‌‌‌కు రాజ్యాంగ హోదా కల్పించడం ఓ చారిత్రాత్మక నిర్ణయం. ఓబీసీ వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేయడం కేంద్రం చేసిన మరో గొప్ప మేలుగా ఓబీసీలు భావిస్తున్నారు. ఓబీసీ క్రిమిలేయర్ రూ.6 లక్షల నుండి 8 లక్షలకు పెంచడం దేశంలో ఎందరో బీసీ కులాలు ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా ఈడబ్ల్యుఎస్ వర్గాలకు (అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన పేదవాళ్లు) 10 శాతంగా, కేంద్రీయ విద్యాలయం, సైనిక స్కూళ్లు, నవోదయాలలో 27 శాతం రిజర్వేషన్లతో సరికొత్తగా 4 లక్షల మందికి లాభం చేకూరింది. నీట్ పరీక్షలో మెడికల్ సీట్లు 27 శాతానికి పెంచడం వల్ల 4500కు రావడం ఓబీసీలకు ఎంతో మేలు జరిగింది. అదనంగా 1000 సీట్లు అగ్రవర్ణ పేదలకు అందుబాటులోకి వచ్చాయి.

బీజేపీ వైపు చూస్తున్న పార్టీలు

ఎన్నో పథకాలు కేంద్రం, రాష్ట్రం కలిసి ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం వల్ల రాష్ట్రంలో ఓబీసీ కులాల శక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఇవన్నీ చూసి ఇన్నాళ్లు మాయావతి వెంట నడిచిన వాల్మీకి, సోన్ కార్, పాసికోరి లాంటి కులాలు బీజేపీ వైపు చూస్తున్నారు. అలాగే సమాజ్ వాద్ పార్టీని నమ్మి మోసపోయిన యాదవులు, ఇతర ఓబీసీ కులాలు కమలం వైపు నడుస్తున్నారు. స్వామి ప్రసాద్ మౌర్య లాంటి అవకాశవాద నాయకుడిని బీజేపీపై ప్రయోగించి ఓబీసీలను బీజేపీకు దూరం చేయాలనుకున్నారు. నిజానికి ఆయన కుమార్తె సంఘమిత్ర బీజేపీ పార్లమెంట్ సభ్యురాలుగా ఉంది. స్వామి ప్రసాద్ తనతోపాటు తన కొడుక్కి టిక్కెట్ ఇవ్వాలని కోరగా కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమైన బీజేపీ ఒప్పుకోలేదు. దాంతో ఆయనేదో ఓబీసీ నాయకుడిగా ఎక్స్​పోజ్ ఇవ్వబోయి బోర్లాపడ్డాడు. ఆఖరుకు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరడంతో ఈ కుటిల రాజకీయాలకు తెరపడింది. సామాజిక న్యాయం మొదటిసారి ప్రజలు చవిచూస్తున్న సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నికలు భారత రాజకీయాలను ప్రభావితం చేసేవి. అందువల్ల యూపీ ఓబీసీలు, దళితులు బీజేపీకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దాని ఫలితం త్వరలోనే దేశం చూడబోతోంది.

బీసీ కమిషన్‌‌‌‌కు రాజ్యాంగ హోదా కల్పించడం..

ఎన్నోసార్లు కేంద్రంలో అనేక ప్రభుత్వాలు సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాద్ పార్టీల మద్దతుతో ఏర్పడ్డవే. యూపీలో కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయాధికారం పొందిన ఈ పార్టీలు ఓబీసీలకు చేసింది మాత్రం శూన్యం. మోడీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్‌‌‌‌కు రాజ్యాంగ హోదా కల్పించడం ఓ చారిత్రాత్మక నిర్ణయం. ఓబీసీ వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేయడం కేంద్రం చేసిన మరో గొప్ప మేలుగా ఓబీసీలు భావిస్తున్నారు. ఓబీసీ క్రిమిలేయర్ రూ.6 లక్షల నుండి 8 లక్షలకు పెంచడం దేశంలో ఎందరో బీసీ కులాలు ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా ఈడబ్ల్యుఎస్ వర్గాలకు (అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన పేదవాళ్లు) 10 శాతంగా, కేంద్రీయ విద్యాలయం, సైనిక స్కూళ్లు, నవోదయాలలో 27 శాతం రిజర్వేషన్లతో సరికొత్తగా 4 లక్షల మందికి లాభం చేకూరింది. నీట్ పరీక్షలో మెడికల్ సీట్లు 27 శాతానికి పెంచడం వల్ల 4500కు రావడం ఓబీసీలకు ఎంతో మేలు జరిగింది. అదనంగా 1000 సీట్లు అగ్రవర్ణ పేదలకు అందుబాటులోకి వచ్చాయి.

- డా. కె.లక్ష్మ ణ్, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు