ఉత్తరప్రదేశ్ లో దెబ్బ తప్పదా?

ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఈనెల 19న జరిగే చివరి విడత పోలింగ్ లో మిగిలిన 13 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతుంది.ఆరు విడతల పోలింగ్ ట్రెండ్స్ ను చూస్తే బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక సమీకరణలు జరిగినట్లు తెలుస్తోంది. 2014లో పార్టీకి అండగా నిలిచిన కొన్ని కులాలు ఈసారి రకరకాల కారణాల వల్ల దూరమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తారుమారుచేసే అనేక కులాలు, వర్గాల్లో ఈసారి బీజేపీపై లోలోపల అసమ్మతి రాజుకుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ గెలుపు అవకాశాలను దెబ్బతీసే స్థాయిలో ఈ అసమ్మతి ఉందని వీరంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ కులాలు, వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడంలో విజయం సాధించిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఫెయిల్ అవుతుందన్న సంకేతాలు అందుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో 41శాతం ఓట్ షేర్ తో యూపీలో ఎన్డీయే కూటమి 73నియోజకవర్గా లను గెలుచుకుంది. 2017 లో జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఇదే ఓట్ షేర్ తో 323అసెంబ్లీ నియోజకవర్గా ల్లో విజయం సాధించిం ది.ఈసారి లోక్ సభ ఎన్నికల్లో అందుకు భిన్నమైన పరి-స్థితి కనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు.రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న ట్రెండ్స్ ను బట్టి సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్కూటమికి 40 నుంచి 55 సీట్లు వచ్చే అవకాశాలు కని-పిస్తున్నాయి. బీజేపీకి కేవలం 15 నుంచి 25 వరకుమాత్రమే సెగ ్మెంట్లు దక్కుతాయని ట్రెండ్స్ స్పష్టం చే-స్తున్నాయి. కాంగ్రెస్ కు కేవలం ఐదు నుంచి తొమ్మిదిసీట్లు మాత్రమే వస్తాయంటున్నాయి ట్రెండ్స్.

2014లో కులాల లెక్కలతో బీజేపీ సక్సెస్

సహజంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కులాల లెక్కలేకీలకం. 2014 ఎన్నికల్లో దీనిని ఆధారం చేసుకునేబీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా రాజకీయాలు చేశారు.బీసీల్లో నాన్ యాదవులను అలాగే దళితుల్లో నాన్జాతవ్ లను దగ్గరకు తీసుకున్నారు. ఆ కులాలకుపెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చారు. పార్టీ లో మంచిపోస్టులు ఇచ్చారు. దీంతో కొన్ని దశాబ్దాలుగా ఎస్పీ,బీఎస్పీ, కాంగ్రెస్ పట్టిం చుకోని కులాలకు రాజకీయప్రాధాన్యం పెరిగింది. బీసీల పేరు చెప్పుకుని కేవలంయాదవులు, దళితుల పేరుతో కేవలం జాతవ్ కులస్తు-లు మాత్రమే ఎదిగారని, ఆయా వర్గా ల్లో ని మిగతాకులాలను ఎవరూ పట్టిం చుకోలేదన్న ఆవేదననుబీజేపీ ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోగలిగింది. ఈకులాల లెక్కలకు తోడు సంప్రదాయంగా ఉండే పెద్దకులాల మద్దతు బీజేపీకి బాగా కలిసివచ్చింది. ఎన్ని క-ల్లో సత్తా చాటింది.

2017 అసెంబ్లీ ఎన్ని కల తర్వాత ముఖ్యమంత్రిపదవి తమకు వస్తుందని రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోఉన్న బీసీలు ఆశించా రు. అందరినీ ఆశ్చర్యపరుస్తూపెద్ద కులానికి చెందిన లోక్ సభ సభ్యుడు యోగి ఆదిత్యనా ధ్ ను సీఎం పోస్టుకు బీజేపీ ఎంపిక చేయడంవెనుకబడిన తరగతులకు మింగుడపడలేదు.బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం తో బీసీల్లో అసమ్మతిపెరిగిందని రాజకీయ విశ్లేష కులు భావిస్తున్నారు.అంతేకాదు ఠాకూర్ కులానికి చెందిన ఆదిత్య నాధ్కు సీఎం పోస్టుకు ఎంపిక చేయడంతో బ్రాహ్మణులుకూడా బీజేపీ పై నారాజ్ అయినట్లు సమాచారం.ఇదే తరహాలో రాష్ట్రంలోని వివిధ బీసీ కులాలు ఈసారిబీజేపీకి దూరమైనట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తు-న్నారు. యాదవుల తర్వాత రాజకీయంగా పలుకుబడిఉన్న కుర్మీలు, కుష్వాహా కులస్తుల్లో కూడా మెజారిటీవర్గం ఈసారి రకరకాల కారణాల వల్ల కమలదళానికిదూరమైనట్లు రాజకీయ వర్గా ల సమాచారం.

‘అచ్ఛేదిన్ ’ నినాదానికి మహిళలు ఫిదా

2014 ఎన్ని కలకు ముందు నరేంద్ర మోడీఇచ్చిన ‘అచ్ఛేదిన్’ నినాదానికి కులమతాల-కతీతంగా యూపీలోని మహిళలంతా ఫిదాఅయ్యారు. మోడీ తమ జీవితాల్లో వెలుగులునిం పుతారని ఆశపడ్డారు. అయితే ఎన్డీయేసర్కా ర్ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంసగటు ఆడవారికి షాకిచ్చిం ది. ఎంతో కష్టపడిదాచుకున్న వెయ్యి, ఐదు వందల నోట్లను మా-ర్చు కోవడానికి గంటలు గంటలు బ్యాం కులముందు క్యూల్ లో నిలబడి నానా ఇబ్బం దులుపడ్డారు.ఆ రోజులను ఆడవాళ్లు ఇప్పటికీమరచిపోలేకపోతున్నారు. దీంతో బీజేపీపైఆడవారు లోలోపల అసంతృప్తి పెంచుకున్న-ట్లు సమాచారం.

మారిన కులాల లెక్కలు

కిందటిసారి ఎన్ని కలతో పోలిస్తే ఈసారి కులాల లెక్కల్ లోమార్పులు వచ్చాయి. విడివిడిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీఈసారి జట్టుగా బరిలో ఉన్నాయి. ఒకరి ఓట్లను మరో పార్టీకిట్రాన్స్ ఫర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలోబీజేపీని ఢీకొట్టే సత్తా తమకే ఉందన్నాయి. ఈ మాటలు ముస్లిం -లను ఆకట్టుకుం టున్నాయి. బీజేపీని ఓడించే సత్తా ఏ పార్టీకిఉంటుందో గమనిం చి ఆ పార్టీ పట్ల అనుకూల వైఖరి తీసుకుం-టున్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పూర్వాంచల్గా పిలిచే తూర్పు యూపీలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది.

ఓట్ షేర్ ఎందుకు తగ్గుతోంది?

కిందటిసారి ఎన్ని కల్లో 41 శాతం ఉన్న ఓట్షేర్ ఈసారి పడిపోతుందని ట్రెండ్స్ ను ఫాలోఅయితే తెలుస్తోంది. కనీసం మూడు నుంచిఐదు శాతం ఓట్ షేర్ తగ్గుతోం దని ట్రెండ్స్ఆధారంగా పొలిటికల్ ఎనలిస్టులు చెబుతు-న్న మాట. అసలు ఓట్ షేర్ అంటే ఏంటోముందు చూద్ద ాం. ఓట్ షేర్ అనుకునే గ్రూప్లో రకరకాల మంది ఉంటా రు. బీజేపీ ఐడి-యాలజీతో కనెక్ట్ అయిన వాళ్లు, బీజేపీ వల్లనేసమాజానికి మేలు జరుగుతుందని భావించేవాళ్లు , మిగతా అన్ని రాజకీయ పార్టీల కంటేకమలదళమే బెటర్ అని ఫీలయ్యే వాళ్లు,నరేంద్ర మోడీ నాయకత్వానికి జై కొట్టే వాళ్లుఇలా అనేక రకాల వ్యక్ తులు ఈ ఓట్ షేర్లో ఉంటా రు. మోడీ ఐదేళ్ల పాలన తర్వాతయూపీ వరకు బీజేపీ ఓట్ షేర్ పెరగకపోగాతగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అయోధ్యలో పరిస్థితి ఏంటి ?

అయోధ్యలో కూడా భిన్నమైన రాజకీయ వాతావ-రణం నెలకొంది. కేంద్రంలో మోడీ సర్కార్ రాగానేరామమందిర నిర్మాణం పై అయోధ్య ప్రజలు ఆశలుపెట్టుకున్నారు. ఐదేళ్ల పాటు కేంద్రంలోనూ, రెండేళ్లపాటు రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండి కూడామందిర నిర్మాణం ఎందుకు జరగలేదని సామాన్యజనం ప్రశ్ని స్తున్నారు. దీనికి బీజేపీ లీడర్ల దగ్గరసమాధానం లేదు. దీనికితోడు ఈసారి కొన్ని నియో-జకవర్గా ల్లో సిట్టిం గ్ ఎంపీలకు కమలదళం టికెట్లుఇవ్వలేదు. ఇది కూడా పార్టీ కి మైనస్ పాయింట్ గామారిందంటున్నారు ఎనలిస్టులు.   – ది వైర్ సౌజన్యం తో