ఇలా తయారయ్యారేంట్రా.. వావివరసలు మరిచి.. వియ్యంకుడితో జంప్ అయిన నలుగురు పిల్లల తల్లి !

ఇలా తయారయ్యారేంట్రా.. వావివరసలు మరిచి.. వియ్యంకుడితో జంప్ అయిన నలుగురు పిల్లల తల్లి !

ఉత్తర ప్రదేశ్: మన దేశంలో కొందరికి వావివరుసలు లేకుండా పోయాయి. కాబోయే అల్లుడితో అత్త ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే మరో చండాలం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో మరో నీచమైన ఘటన జరిగింది. ఒక మహిళ వియ్యంకుడితో లేచిపోయింది. కడుపున పుట్టిన కూతురికి మామ అయిన వ్యక్తితో మహిళ ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఘటన గురించి తెలిసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మమత అనే మహిళ వయసు 43 సంవత్సరాలు. ఆమెకు నలుగురు సంతానం. మమత కూతురికి 2022లో పెళ్లైంది. అయితే.. కూతురి పెళ్లయిన కొన్నాళ్లకు కూతురి మామ శైలేంద్ర(46)తో మమతకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం కాస్తా ఒకరికి ఒకరు కాల్స్ చేసుకుని, వీలున్నప్పుడు నేరుగా కలుసుకునేంత వరకూ వెళ్లింది. మమత భర్త సునీల్ కుమార్ ఒక లారీ డ్రైవర్. కుటుంబ పోషణ కోసం కొన్ని రోజుల పాటు లారీ డ్రైవింగ్ చేస్తూ.. అడపాదడపా ఇంటికొస్తూ ఉండేవాడు. అయితే.. కుటుంబ పోషణకు అవసరమైన డబ్బును ఎప్పటికప్పుడు తన భార్య మమతకు పంపేవాడు. 

ఇలా.. సునీల్ కుమార్ ఇంటి దగ్గర లేకపోవడం తన వియ్యంకుడు శైలేంద్రకు కలిసొచ్చింది. అతను ఇంట్లో లేని సమయం చూసి మమతను కలవడానికి శైలేంద్ర ఇంటికొస్తూ ఉండేవాడు. పిల్లలను ఏదో ఒక పనిపై బయటకు పంపించేసి వియ్యంకుడితో కలిసి మమత ఇంట్లోనే కామకలాపాలు సాగించేది. సునీల్ కుమార్ కు ఈ విషయం తెలిసే సరికి.. తన ప్రియుడైన వియ్యంకుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మమత నిర్ణయించుకుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో డబ్బు, నగలు తీసుకుని టెంపోలో వెళ్లిపోయారు.

శైలేంద్ర నెలకు రెండుమూడు సార్లు మమత ఇంటికి.. అది కూడా సునీల్ కుమార్ ఇంట్లో లేనప్పుడు వస్తూపోతున్న విషయం ఇరుగుపొరుగు వాళ్లకు తెలిసినప్పటికీ అనుమానం కలగలేదు. అందుకు కారణం లేకపోలేదు. మమతకు సునీల్ కుమార్ స్వయానా వియ్యంకుడు కావడంతో బంధుత్వం వల్ల వస్తున్నాడేమోనని ఇరుగుపొరుగు వాళ్లు భావించారు. కానీ.. వీళ్లు ఇలా బరి తెగించారని ఏ ఒక్కరికీ అనుమానం రాలేదు. సునీల్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ లేచిపోయిన వియ్యపురాలు, వియ్యకుండి కోసం గాలిస్తున్నారు.