పోలీస్ అయితే ఏంటీ.. పోలీస్ జీపు అయితే ఏంటీ: ఓ తాగుబోతు వీరంగం మామూలుగా లేదు..!

పోలీస్ అయితే ఏంటీ.. పోలీస్ జీపు అయితే ఏంటీ: ఓ తాగుబోతు వీరంగం మామూలుగా లేదు..!

డెహ్రాడూన్: నూతన సంవత్సర వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్ జరిగాయి. ముక్క చుక్కతో చిల్ అవుతూ యువత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‎ను ఎంజాయ్ చేసింది. కొన్ని చిన్నాచితక ఘటనలు మినహా ఈ ఏడాది న్యూ వేడుకలు ప్రశాంతంగానే జరిగాయి. కొన్ని చోట్ల మాత్రం మందు బాబులు హంగామా చేశారు. మద్యం మత్తులో పోలీసులపై దాడులకు దిగారు. ఉత్తరాఖాండ్‎లోనూ ఇలాంటి తరహా ఘటన ఒకటి జరిగింది. పూట్ గా మద్యం తాగిన ఓ యువకుడు మత్తులో పోలీసులపై దాడి చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఘరత్‌ ప్రాంతానికి చెందిన వివేక్ బిష్త్‌ న్యూ ఇయర్ సందర్భంగా ఫ్రెండ్స్‎తో కలిసి చిల్ అయ్యాడు.

ఫుల్‎గా మందు కొట్టి ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలోకి ఉన్న వివేక్ బైక్ పై వెళ్తూ పక్కనున్న వాహనాలను ఢీకొట్టడంతో పాటు పాదచారులను ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివేక్‎ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వివేక్.. పోలీసులపైన కారాలు మిర్యాలు నూరాడు. పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారిపైనే ఎదురు దాడికి దిగాడు. అసభ్య పదజాలంతో పోలీసులను దూషించాడు. ఎలాగోలా వివేక్ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ తీసుకెళ్లేందుకు ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించగా.. కారులోనూ వివేక్ వీరంగం సృష్టించాడు. పోలీస్ కారులో వెనక కూర్చొన వివేక్ కారు అద్దాలు పగలగొట్టి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు.

వివేక్ పోలీసులపై దాడి చేయడం, కారు అద్దాలు పగలగొట్టడం, బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసులు తమ స్టైల్లో ట్రీట్‎మెంట్ ఇస్తేనే మనోడు దారికి వస్తాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. పబ్లిక్ న్యూసెన్స్, పోలీసులపై దాడి, విధులకు ఆటంకం కలిగించిన సెక్షన్ల కింద వివేక్‎పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో రాత్రి వీరంగం సృష్టించిన వివేక్ పోలీసుల ట్రీట్మెంట్ తర్వాత క్షమాపణలు చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.