ఇండియన్ ఫారెక్స్ నిల్వలు డిసెంబర్13తో ముగిసిన వారానికి 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందు వారంలో మొత్తం నిల్వలు 3.235 బిలియన్ డాలర్లు తగ్గి 654.867 బిలియన్లకు పరిమితమయ్యాయి.
విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. డాలర్ విలువతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గినా.. బంగారం నిల్వలు 1.211 బిలియన్ డాలర్లు పెరిగి 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్డ్రాయింట్ రైట్స్(ఎస్డీఆర్ఎస్) 35 మిలియన్ డాలర్లు తగ్గి 17.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ALSO READ : ఎంఫ్లకు నిధుల వరద..ఈ ఏడాదిలో రూ.17 లక్షల కోట్లు
కారణాలు
- యూఎస్ డాలర్ విలువ పెరగడం.
- దేశీయ దిగుమతులు అధికం కావడంతో విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తులకు డాలర్లలోనే చెల్లించాల్సి రావడం.
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కాలంలో కీలక వడ్డీరేట్లను తగ్గించడం.