తెలంగాణ ఎన్నికల వేళ నోట్ల కట్టలు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న నగదు అగ్నికి ఆహుతైంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కారు డిక్కీలో నోట్ల కట్టలు పెట్టుకుని శుక్రవారం (నవంబర్ 24న) వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు బయల్దేరారు. బొల్లికుంట క్రాస్‌రోడ్ వద్దకు రాగానే కారులో నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ కారును నిలిపివేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ డబ్బు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్న కొన్ని నోట్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. పాక్షికంగా దగ్ధమైన కారును మామునూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనా స్థలిని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు. కారు, అందులోని నగదు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=jC1N0Sxanco