ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫినాండ్ల్ మొదటి స్థానంలో ఉంది. బుధవారం (మర్చి 20)న ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా వరల్డ్ హ్సాపీనెస్ ఇండెక్స్ 2024 తన నివేదికలను విడుదల చేసింది. ప్రపంచంలోని 143 పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకొని దీన్ని రూపొందిస్తారు. సంతోష సూచీల్లో యూరప్ దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్ ల్యాండ్ దేశాలు వరసగా మూడు స్థానాల్లో నిలిచాయి. ఇందులో విశేషం ఏటంటే ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో నిలవటం ఇది ఏడో సారి. ఈ టాపిక్ ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యం.. ప్రపంచ సంతోష సూచి 2024 లో ర్యాంక్ లను గురించి ప్రశ్నలు వస్తాయి.
మరి మనం దేశం ర్యాంక్ ఎక్కడ అనుకుంటున్నారా? ఈ జాబితాలో ఇండియా 126వ ప్లేస్ లో ఉంది. సంతోష సూచిలో భారత్ గత ఏడాదిలో పోలిస్తే ఒకస్థానం కిందకి దిగజారడం బాదాకరం. ఇక మన పక్క దేశాలు పాకిస్తాన్ 108, చైనా 60, నేపాల్ 95, మయన్మార్ 118వ స్థానాల్లో ఉన్నాయి. అగ్రదేశంగా చెప్పుకునే అమెరికా 23వ ర్యాంక్ సరిపెట్టుకుంది. ఫిన్లాండ్ తక్కువ జనాభా, సపన్నమైన దేశం కాబట్టి అక్కడ అందరూ సంతోషంగా ఉంటారు. ఆ దేశంలో మమేకమై కలిసి మెలిసి ఐకమత్యంతో జీవిస్తారు. విద్యకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఫిన్లాండ్ ఏడు సార్లు మొదటి స్థానంలో నిలిచింది.
ALSO READ :- Siddharth Roy Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సిద్ధార్థ్ రాయ్..స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడ?