డాక్టర్​ భార్య ట్రీట్​మెంట్.. మహిళ మృతి

ఇల్లెందు, వెలుగు: ఎలాంటి అవగాహన లేని డాక్టర్​భార్య ట్రీట్​మెంట్ చేయడంతో మహిళ మృతి చెందిందని ఇల్లెందు మండలం కోమరారంలో కొందరు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లెందు మండలం పోలారవ అనుబంధ గ్రామమైన భద్రుతండాకు చెందిన భూక్య కైక(45) రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ట్రీట్​మెంట్​కోసం శనివారం మధ్యాహ్నం కోమరారంలోని ఓ ప్రైవేట్ క్లినిక్​కు తీసుకెళ్లారు. డాక్టర్​అందుబాటులో లేకపోవడంతో అతని భార్య ట్రీట్ మెంట్​చేసింది. అయితే కైక ఆదివారం చనిపోయింది. 

ఎంబీబీఎస్​డాక్టర్​అన్న నమ్మకంతో క్లినిక్​కు తీసుకెళ్తే, అతని భార్య ఎలాంటి అవగాహన లేకుండా కైకకు ఇంజక్షన్ వేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంజక్షన్​వికటించడంతోనే చనిపోయిందని ఆరోపించారు. కోమరారంలోని క్లినిక్​ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్​భార్యను పోలీసులు ఇల్లెందు పోలీస్​స్టేషన్​కు తరలించినట్లు తెలిసింది.