
సారంగాపూర్, వెలుగు : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామ శివారులో ఉన్న కల్వర్టులో గురువారం సాయంత్రం పసికందు డెడ్ బాడీ కనిపించింది. నీటిలో తేలుతున్న మగ శిశువు డెడ్‌బాడీని గుర్తించిన గ్రామస్తులు సారంగాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. నెలలు నిండక ముందే ప్రసవించడంతో ఎవరికీ తెలియకుండా శిశువును పడేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.