కామారెడ్డిలో ఎన్‌‌ఎస్‌‌యూఐ ఆవిర్భావ వేడుకలు

కామారెడ్డిలో ఎన్‌‌ఎస్‌‌యూఐ ఆవిర్భావ వేడుకలు

కామారెడ్డిటౌన్​, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఎన్‌‌ఎస్‌‌యూఐ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించారు.  జిల్లా ప్రెసిడెంట్​ఐరేని సందీప్​ మాట్లాడుతూ..  స్టూడెంట్స్​ సమస్యల పరిష్కారానికి ఎన్‌‌ఎస్‌‌యూఐ  పోరాటం చేస్తుందన్నారు.   ఎన్‌‌ఎస్‌‌యూఐ ఎంతో మంది నేతల్ని తయారు చేసిందన్నారు.  ప్రతినిధులు భరత్​టింక్​,  రాహుల్​, సోఫియాన్​, ఆకాశ్, అలీం తదితరులు పాల్గొన్నారు. 

తాడ్వాయి, వెలుగు: నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇండియా ఆవిర్భావ వేడుకలు మంగళవారం తాడ్వాయి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విద్యార్థి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ యూఐ ఏర్పడిందని ఈ విభాగం విద్యార్థుల సమస్యలు తీర్చడం కోసం పనిచేస్తుందన్నారు  కార్యక్రమంలో అధ్యక్షుడు వరుణ్ రావు, ప్రశాంత్ గౌడ్, వేణు రెడ్డి ఎన్ ఎస్‌‌యూఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 
 

 బోధన్ లో..
 

బోధన్, వెలుగు: ఎన్ఎస్ యూఐ54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ యూఐ జెండా ఎగురవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌‌ఎస్‌‌యూఐ  బోధన్ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్ కుమార్  మాట్లాడుతూ..  నేడు ఎన్ఎస్ యూఐ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా కొనియాడారు.  కార్యక్రమంలో ఎన్‌‌ఎస్‌‌యూఐ నాయకులు  పీరాజీ , లక్ష్మణ్, సామ్రాట్ గౌడ్, పవన్ కుమార్, విజయ్, జీవన్, వెంకటేష్, రవి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.