
- సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల క్యాలెండర్ల ఆవిష్కరణ
కోల్‌బెల్ట్, వెలుగు: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, వారి కోసం పనిచేస్తామని చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రం గోపాలవాడలోని షారోన్గాస్పెల్చర్చిలో మంచిర్యాల జిల్లా యునైటెడ్పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
పాస్టర్లు, క్రైస్తవ సమాజానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను పాస్టర్లు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేవీ ప్రతాప్, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, ఫాస్టర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్రజనీకుమార్, సెక్రటరీ రత్న కుమార్, వైస్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.
గాంధారి మైసమ్మ తల్లికి పూజలు
మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారి మైసమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగిన సప్తశత చంఢీ యాగంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట బొక్కలగుట్ట సర్పంచి బొలిశెట్టి సువర్ణ, మాజీ ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.
అనంతరం మందమర్రి సింగరేణి మహిళా డిగ్రీ కాలేజ్‌లో చేపట్టిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, అసోసియేషన్ బాధ్యులతో కలిసి న్యూ ఇయర్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. మందమర్రి మున్సిపాలిటీ 14వవార్డులో ప్రజాపాలనలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.