
న్యూఢిల్లీ : సెంచరీ ప్లైబోర్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీలోని బద్వేలులో ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానెల్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంటును ప్రారంభించింది. ఇది ఇండియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానెల్ ప్లాంటని ప్రకటించింది. వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్‌లో రెండో దశలో రూ. 1,000 కోట్ల మొత్తం పెట్టుబడి ఉంటుంది.
రాబోయే ఐదేళ్లలో 2,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మొదటి దశలో రూ.950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెంచరీప్లై చైర్మన్ సజ్జన్ భజనకా, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు.