ఆర్మూర్, వెలుగు: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ( మెప్మా) ఆధ్వర్యంలో పట్టణ సమాఖ్య(టీఎల్ఎఫ్) పర్యవేక్షణలో ఆర్మూర్డిగ్రీ కాలేజీ వద్ద, పెర్కిట్శివాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దళారులకు రైతులు ధాన్యం విక్రయించవద్దని, టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతుధర పొందాలన్నారు.
ఏ గ్రేడ్ రకానికి రూ.2320, బీ గ్రేడ్ కు రూ.2,300 తో పాటు రూ.500 బోనస్ పొందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ షేక్మున్ను, కౌన్సిలర్లు బండారి ప్రసాద్, ఇట్టెడి నర్సారెడ్డి, ఆకుల రాము, లిక్కి శంకర్, ఫయాజ్, టీఎంసీ ఉదయశ్రీ, సీవో రాజలింగం, టీఎల్ఎఫ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.