కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇందిరా భవన్ ను సోనియాగాంధీ ప్రారంభించారు.
ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నెంబర్ బంగ్లా లో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అందుకు అనుగుణంగానే అన్ని పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. దాదాపుగా 50 సంవత్సరాలపాటు అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ భవనంలో కార్యకలాపాలు నిర్వహించారు. అక్బర్ రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయం నిర్మించారు. దీంతో నేటినుంచి 9A కోట్లా రోడ్ కి ఏఐసిసి నూతన కార్యాలయం మారనుంది.
అయితే 2008లో దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్ లో కాంగ్రెస్ పార్టీ నూతన భవన నిర్మాణానికి కేంద్రం స్థలం కేటాయించింది. దీంతో 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణపనులు మొదలు పెట్టింది. 15 ఏళ్ళ తర్వాత నిర్మాణం పనులు పూర్తయ్యాయి.