సూర్యాపేట, వెలుగు : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను సోమవారం కలెక్టర్ వెంకట్‌రావు.. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, జడ్పీ సీఈవో అప్పారావు తో కలసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసెల్‌లో సీవిజిల్, 1950 కాల్ సెంటర్, సువిధ పర్మిషన్స్, ఎన్‌జీఆర్‌పీఎస్ పోర్టల్ , పీడబ్ల్యూడీ సాక్ష్యం యాప్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.
జిల్లా ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగే సంఘటనలు, ఎదురయ్యే సమస్యలపై యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, సిబ్బందికి విడతల వారీగా విధులు కేటాయించామని చెప్పారు. ఈ ఈ కార్యక్రమంలో ఏవో సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, సిబ్బంది పాల్గొన్నారు.