సూర్యాపేటలో అక్టోబర్ 2 న ఐటీ హబ్ ప్రారంభం : జగదీశ్ రెడ్డి

సూర్యాపేటలో అక్టోబర్ 2 న ఐటీ హబ్ ప్రారంభం : జగదీశ్ రెడ్డి
  • 26 న టాస్క్  ‌‌‌‌ ఆధ్వర్యంలో జాబ్  ‌‌ ‌‌మేళా
  • విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలో అక్టోబర్ 2న   మంత్రి కేటీఆర్ ‌‌ ‌‌ చేతులమీదుగా ఐటీహబ్ ‌‌ను ప్రారంభిస్తామని, 26న టాస్క్ ‌‌ ‌‌ ఆధ్వర్యంలో జాబ్  ‌‌ ‌‌మేళా ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జాబ్ మేళా పోస్టర్ ‌‌ ‌‌ను  ఐటీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ హబ్  ‌‌ ‌‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు 9  కంపెనీలు ముందుకొచ్చాయని, వీటిలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు.  

Also Read :- పాలమాకులలో ఫ్లెక్సీ కలకలం

సదాశివ రెడ్డి ఫంక్షన్ హాల్ ‌‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే జాబ్ మేళాను  బీటెక్ చదివిన అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.  అంతకు ముందు ఐటీ హబ్  ‌‌ ‌‌గా మార్చనున్ను పాత కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు. భవనంలో వారంలోగా కార్పొరేట్ తరహాలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఎస్  ‌‌ ‌‌ఐఐసీ  ఎండీ నర్సింహ రెడ్డి, టాస్క్ డైరెక్టర్  శ్రీకాంత్ సిన్హా, ఐటీ డైరెక్టర్ రంగినేని విజయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ 

సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రూ. 30 కోట్ల వ్యయం, ఆరు ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మించామని మంత్రి జగదీశ్  ‌‌ ‌‌ రెడ్డి చెప్పారు.  ఎడ్యుకేషనల్ టూర్  ‌‌లో భాగంగా మార్కెట్  ‌‌ ‌‌తో పాటు ట్యాంక్ బండ్, మహాప్రస్థానాన్ని సందర్శించేందుకు వచ్చిన హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ విద్యార్థులు మంత్రి వివరించారు.  అనంతరం మసీద్ సమీపంలో  రూ. 80 లక్షలతో  నిర్మించనున్న మైనారిటీ  కమ్యూనిటీ హాల్  ‌‌ ‌‌ శంకుస్థాపన చేశారు.