
- షురూ చేయనున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి టౌన్శివారులోని కన్నాల పాత రైల్వే గేట్ ఎల్ సీ నెంబర్ 63 వద్ద నిర్మించిన కొత్త రైల్వే అండర్ బ్రిడ్జిని సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్వెంకట్స్వామి ప్రారంభించనున్నారు.ఈ బ్రిడ్జిని రూ.3.10కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో బెల్లంపల్లి, తాండూర్ మండలాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ఎమ్మెల్యే వినోద్ తో పాటు జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొంటారని అధికారులు తెలిపారు.