ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి ఆదివారంలో భాగంగా నిర్వహించిన పెద్దపట్నం ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. 3వందల మంది ఒగ్గు పూజారులు తీరొక్క రంగవల్లులతో సుమారు 9గంటలపాటు శ్రమించి పెద్ద పట్నం వేయగా భక్తులు పట్నం తొక్కి పులకించిపోయారు. పసుపు బండారి చల్లుకుంటూ తన్మయం చెందారు. శివ సత్తులు పునకాలు..మల్లన్న జయజయ నాథల నడుమ పెద్దపట్నం మహత్తర ఘట్టం అట్టహాసంగా ముగిసింది. ముందుగా స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత కళ్యాణంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
స్విస్ ఓపెన్ టైటిల్ పీవీ సింధు కైవసం