ఐనవోలు మల్లన్నకు రూ.1.78 కోట్ల ఆదాయం

ఐనవోలు మల్లన్నకు రూ.1.78 కోట్ల ఆదాయం

ఐనవోలు, వెలుగు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి  రూ.1,78,58,966 ఆదాయం సమకూరింది. ఎండోమెంట్​ వరంగల్ డివిజన్​ పరిశీలకుడు డి.అనిల్​ కుమార్, ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత జనవరి 18 నుంచి ఈనెల 3వ తేదీ వరకు 44 రోజులకుగానూ హుండీల్లో రూ.42,64,669 ఆదాయం వచ్చింది. వివిధ ఆర్జీత సేవా టికెట్ల ద్వారా రూ.1,35,94,297 సమకూరింది. హుండీల్లో వచ్చిన మిశ్రమ వెండి, బంగారు కానుకలను సీల్ చేసి మళ్లీ హుండీల్లోనే  భద్రపరిచారు.