నల్గొండ అర్బన్, వెలుగు : పొరపాట్లు లేకుండా ఓటరు జాబితాను తయారు చేయాలని సంబంధిత అధికారులకు నల్గొండ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆర్డీవోలు, తహసీల్దారులతో ఓటరు జాబితా రూపకల్పనపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 13 నాటికి డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి పేర్లు డిలీట్ చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని వివరాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ప్రతి బీఎల్ఓ దగ్గర కొత్తగా రూపొందించిన ఓటరు జాబితా లిస్టుతో పాటు బీఎల్ఓ రిజిస్టర్ అందుబాటులో ఉండాలన్నారు. ఇంటింటి సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తహసీల్దారుల కృషి చేయాలని సూచించారు. వీడియో కన్ఫరెన్స్లో డీఆర్డీవో కాళిందిని, డజ్పీసీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా మహిళా, శిశు, వయో వృద్ధులు, దివ్యాంగుల శాఖ అధికారిణి కృష్ణ వేణి తదితరులు
పాల్గొన్నారు.