- సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం సెక్రటేరియెట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు.
జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం సాధించిన విజయాలపై డాక్యుమెంటరీలు, గణాంకాలను ప్రతి శాఖ తయారు చేయాలని సూచించారు. పబ్లిక్ స్మారక చిహ్నాలు, భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు.