హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షం

హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షం

గ్రేటర్​ వ్యాప్తంగా శనివారం రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. శుక్రవారం సాయంత్రం మొదలైన వాన ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. అత్యధికంగా షేక్​పేటలో 3.2 సెంటీమీటర్ల వాన కురిసింది. వీకెండ్​ కావడంతో ఐటీ ఎంప్లాయ్స్​ ఇండ్లకే పరిమితం అయ్యారు. వానలో తడుస్తూనే పిల్లలు స్కూళ్లకు

ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లారు. హుస్సేన్​సాగర్ ​నిండడంతో అధికారులు రెండు తూముల నుంచి నీటిని కిందికి వదిలారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డు అధికారులు అలర్ట్ ​అయ్యారు. అధికారులంతా ఫీల్డ్ పై ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.