ఎడతెరిపిలేని వర్షాలు..ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి

భద్రాద్రి కొత్తగూడెం: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉప్పొంగుతోంది.  భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి, చర్లలో తాలిపేరుకు వరద ఉదృతి పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 39.5 అడుగుల వద్ద నిలకడ ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కరకట్టను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎవరూ సంచరించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

ఎగువప్రాంతం  ఛతీస్ గడ్ లో కూడా వర్షాలు పడుతుండటంతో చర్ల వద్ద తాలిపేరు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  దీంతో తాలిపేరు ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి 1లక్షా84, 023 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 73.44 మీటర్లుగా ఉంది.   తాలిపేరు ప్రాజెక్టు1 లక్షా 53 వేల క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది. 

ALSO READ :రెండో విడత లబ్ధిదారులకు అనారోగ్యపు గొర్రెలు

గడిచిన 24 గంటలలో భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా 107 .4 MM వర్ష పాతం నమోదు అయ్యింది.  భద్రాచలం 16. 6 MM , దుమ్ముగూడెం 64 .3 MM అ ధిక వర్ష పాతం కాగా ,చర్ల 10 .9 MM లుగా వర్షపాతం నమోదు అయ్యింది.