
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలతో చెరువులు నిండుకుండలా మారాయి. మంగళవారం రాత్రి నుంచి కురిసిన వానలకు నిర్మల్ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. పైనుంచి భారీ వరద వస్తుండటంతో భైంసా మండలం తిమ్మాపూర్ చెరువుకు గండి కొట్టింది. దీంతో వరద నీరు పంట పొలాల్లోకి, రోడ్లను ముంచెత్తింది. దిగువన ఉన్న పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
ALSO READ :ఉడిపి కాలేజీ బాత్రూమ్ ఘటన.. 1992 అజ్మీర్ లైంగిక కేసుతో లింక్
చెరువుకు గండితో చేపలు కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందని మత్స్య కారులకు వాపోతున్నారు. చెరువు మరమ్మతుల విషయంలో అధికారులు ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా చెరువుకి గండి పడినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.