కస్టడీలో సెక్యూరిటీగార్డు మృతి.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఘటన

  • విచారణకు ఆదేశించిన మాదాపూర్ డీసీపీ

గచ్చిబౌలి, వెలుగు : కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్​ లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గచ్చిబౌలి నానక్​రాంగూడలోని ఓ కంపెనీలో లేబర్​ క్యాంపు వద్ద బిహార్​కు చెందిన నితీష్ కుమార్​(32)సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.  శనివారం రాత్రి కంపెనీలో పనిచేసే కొందరు కార్మికులు బయటకు వెళ్లి వస్తామని అనడంతో నితీశ్ కుమార్ తో పాటు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న దీపక్, పింటులు అడ్డుకున్నారు.  దీంతో కార్మికులకు సెక్యూరిటీ గార్డులకు మధ్య గొడవ జరిగింది.  దీంతో ఇద్దరు కార్మికులను సెక్యూరిటీ గార్డులు కొట్టారు. \

ALSO READ :రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం : ఎంపీ ధర్మపురి అర్వింద్

సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సెక్యూరిటీ గార్డులైన నితీశ్‌‌, దీపక్, పింటులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌‌కు తీసుకెళ్లారు. గాయపడ్డ కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 7.30 నుంచి 8 గంటల సమయంలో పోలీస్‌‌స్టేషన్‌‌లో సెక్యూరిటీ గార్డ్ నితీశ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.  వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కస్టడీ డెత్ మిస్టరీపై  సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు బాలానగర్ జోన్ ఏసీపీతో దర్యాప్తు చేయిస్తున్నామని మాదాపూర్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.