బాలానగర్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ లాబొరేటరీస్ లో ఈరోజు(ఫిబ్రవరి 04) అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పొగలు దట్టంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు ఫైర్ సిబ్బంది.
సమాచారం ఇచ్చేందుకు కంపెనీ యాజమాన్యం నిరాకరిస్తుందని స్థానికులు పేర్కొన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.