
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రెండ్రోజుల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు యువకులు చనిపోయారు. న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల రాజు(32) వ్యవసాయం చేస్తున్నాడు. సోమవారం రాత్రి 10.30 గంటలకు రాజుకు గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చేవెళ్ల గవర్నమెంట్హాస్పిటల్కు తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన డాక్టర్లు కండీషన్ సీరియస్‌గా ఉందని .. వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లమని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీపీఆర్ చేస్తుండగానే.. రాజు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బస్సులో వస్తుండగా మరొకరు
చేవెళ్ల గ్రామానికి చెందిన చాకలి చక్రపాణి(26) అనే యువకుడు ఇటీవల జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చక్రపాణి ఆదివారం తన ఫ్రెండ్‌తో కలిసి హైదరాబాద్ వచ్చాడు. సాయంత్రం తిరిగి బస్సులో చేవెళ్లకు బయలుదేరాడు. చేవెళ్ల బస్టాప్సమీపంలో చక్రపాణికి గుండెపోటు రావడంతో పక్కనే ఉన్న ఫ్రెండ్ అతడిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే చక్రపాణి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.