- బైక్ వెనక్కి తీస్తుండగా
- అడ్డుకున్న పోలీసులు
- ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి
- కరీంనగర్ లో ఘటన
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండగా చూసిన ఓ యువకుడు..తప్పించుకోబోయి బైక్‌తో సహా ఆర్టీసీ బస్సును ఢీకొట్టి చనిపోయాడు. స్థానికులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఎలబాక శ్రీనివాస్ (33) కరీంనగర్ లోని విద్యానగర్ లో ఉంటూ వెల్డింగ్ పని చేసుకుంటున్నాడు. శుక్రవారం తన అన్న కూతురి పుట్టిన రోజు ఉండడంతో బుధవారం రాత్రి బైక్‌పై గ్రామానికి బయలుదేరాడు.
ఇదే టైంలో నగరంలోని ఎన్టీఆర్ విగ్రహ సమీపంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. పోలీసులను చూసిన శ్రీనివాస్ భయపడి బైక్‌ను వెనక్కి తిప్పబోయాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా అయోమయానికి గురై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. దీంతో బస్సు కింద పడి స్పాట్‌లోనే చనిపోయాడు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్సందర్భంగా పోలీసుల తీరు వల్లే శ్రీనివాస్చనిపోయాడని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళన చేశారు.