ఆదివారం పెళ్లన్నడు..ఆమె శనివారం మృతి

ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడు వంచించాడని మనస్థాపం చెందిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన మహబూబ్​నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

రాచాల గ్రామంలోని తేజస్విని (30), నాగాయిపల్లికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వంచించాడని కుటుంబీకులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం  తేజస్విని వద్దకు వచ్చి ఆదివారం వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాన్నని, తనను వదిలేయాలని బెదరించాడు. మనస్థాపం చెందిన తేజస్విని శనివారం రాత్రి ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మరణించింది.