ఇల్లు ఇవ్వాలంటూ సెల్ టవర్ ఎక్కిండు..ఖమ్మం జిల్లా నాగలిగొండలో ఘటన 

ఇల్లు ఇవ్వాలంటూ సెల్ టవర్ ఎక్కిండు..ఖమ్మం జిల్లా నాగలిగొండలో ఘటన 

ఎర్రుపాలెం,వెలుగు:  ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగలిగొండలో జరిగింది.  పామర్తి శ్రీనివాసరావు గ్రామ పంచాయతీ వర్కర్ గా పని చేస్తున్నాడు.  గతంలో తన భార్య పేరిట మంజూరైన ఇల్లును తప్పుడు పత్రాలతో వేరే వాళ్లు నిర్మించుకున్నారని పేర్కొంటూ.. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు రాకపోతుండగా అధికారులు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం సెల్ టవర్  ఎక్కాడు. అధికారులు, పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కొద్దిసేపటికి కిందకు దిగాడు.