
కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. అర్దరాత్రి సాఫ్ట్ వేర్ ఉద్యోగులను క్యాబ్ లో డ్రాప్ చేసే క్రమంలో రోడ్డుపై కొందరు దుండగులు క్యాబ్ ను ఆపి దోపిడి చేశారు. డ్రైవర్ పై దాడికి దిగారు. దీంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే సాఫ్ట్‌వేర్ ఉదోగులను అనీల్ అనే డ్రైవర్ తన కార్ లో మాదాపూర్ నుండి జీడిమెట్లలోని నెహ్రు నగర్ లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు.
టైం అర్దరాత్రి రెండున్నర కావడంతో రోడ్డు అంతా నిర్మానుష్యంగా మారింది. దీంతో నెహ్రు నగర్ రోడ్డు పై మున్న, రాజా సింగ్, అఖిల్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి డ్రైవర్ పై దాడికి దిగారు. ఉద్యోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వారి వద్ద నుండి కొంత నగదు, సెల్ ఫోన్ లాక్కోవడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ అనిల్ మెడ పై బ్లేడ్ తో గాయ పరిచారు.
అనిల్ ను స్దానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అనిల్ జీడిమెట్ల పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.